బంపరాఫర్ అందుకున్న హరీష్ శంకర్?
వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ ఎంతో గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తర్వాత తిరిగి ట్రాక్ ఎక్కడానికి తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. కానీ ఏపీ ఎలక్షన్స్ వల్ల పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.
దీంతో ఖాళీగా ఎందుకుండటంలే అనుకున్న హరీష్ శంకర్, రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సమ్మర్ లో మిస్టర్ బచ్చన్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తవకముందే హరీష్ శంకర్ కు మరో బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
చిరంజీవి హీరోగా సుస్మిత కొణిదెల నిర్మాతగా తెరకెక్కనున్న సినిమాకు హరీష్ శంకర్ ను దర్శకత్వ బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సుస్మిత తో పాటుగా పీపుల్ మీడియా సంస్థ అధినేతలు కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ త్వరలోనే ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథను అందించనున్నాడని తెలుస్తోంది.













