వీరమల్లు చివరి 20 నిమిషాలే మెయిన్
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆసక్తి లేకున్నా పట్టుబట్టి నిర్మాత AM రత్నం(AM Ratnam) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ప్రాజెక్టును లైన్ లో పెట్టాడు. ఇక తీరా ఆ సినిమా పవన్ పాలిటిక్స్ కారణంగా వాయిదాలతో ఇబ్బంది పడింది. చివరకు దర్శకుడు క్రిష్(Krish) మరో ప్రాజెక్టుకు షిఫ్ట్ కావడంతో జ్యోతికృష్ణ(Jyothi Krishna) ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా కంటెంట్ పై ఆడియెన్స్ లో ఇప్పటికి ఒక క్లారిటీ అయితే లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేసింది లేదు. ఆయనకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. పవన్ కు ఆసక్తి లేకపోయినా పట్టుబట్టి మరీ నిర్మాత ఏఎం రత్నం హరిహర వీరమల్లుని లైన్ లో పెట్టి పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నాడు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా వాయిదా పడి లేటయింది.
దీంతో వీరమల్లు డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి బయటికొచ్చాడు. వీరమల్లు దర్శకత్వ బాధ్యతల్ని నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ తీసుకుని సినిమాను పూర్తి చేస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ లో అసలైన ఆయువు పట్టు ఒక 20 నిమిషాల ఎపిసోడ్ లో ఉంటుందని తెలుస్తోంది. పవన్ కత్తిసాము పోరాటాలు, యుద్ధ వాతావరణం బిగ్ స్క్రీన్కు కనుల విందుగా ఉంటుందని, దాదాపు 40 రోజుల పాటూ ఈ ఎపిసోడ్ కోసం పని చేశారని సమాచారం. పవన్ ఈ యాక్షన్ సీన్ లో పాల్గొనడానికి మార్షల్ ఆర్ట్స్(Martial Arts) లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. మొఘల్ చక్రవర్తుల కాలం నాటి నేపథ్యం కూడా ఈ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.













