HHVM: వీరమల్లు రన్ టైమ్ ఎంతంటే

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu). కరోనాకు ముందు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా రీసెంట్ గా ఏఎం జ్యోతికృష్ణ(AM Jyothi Krishna) దర్శకత్వంలో ముగిసింది. ఏ ముహూర్తాన వీరమల్లు మొదలైందో కానీ అప్పట్నుంచి ఈ సినిమాకు ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.
మొత్తానికి జులై 24న హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సారు కూడా పూర్తి చేసుకోగా సెన్సారు బోర్డు వీరమల్లుకు యూఏ సర్టిఫికెట్ అందించారు. వీరమల్లు నిడివి 2 గంటల 42 నిమిషాలని తెలుస్తోంది. పవన్ సినిమాను 162 నిమిషాలంటే తక్కువనే అనుకోవాలి. ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ దాదాపు 3 గంటల రన్ టైమ్ తోనే వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 162 నిమిషాల రన్ టైమ్ వీరమల్లుకు చాలా ప్లస్ కానుంది. సినిమా చూసిన సెన్సారు బోర్డు క్లైమాక్స్ చాలా బావుందని, రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ కథలో పార్ట్2 కు సంబంధించిన లీడ్ కూడా బాగా కుదిరిందని, సినిమాలో పవన్ ఇంట్రో సీన్స్, కీరవాణి(Keeravani) బీజీఎం, విజువల్స్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ లా ఉంటుందని అంటున్నారు. నిధి అగర్వాల్(Niddhi Agerwal) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రలో నటించారు.