వీరమల్లు వర్క్ ఒక చోట కాదుగా!
ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. అందులో మొదటిది హరిహర వీరమల్లు. డిసెంబర్ లో అయినా వీరమల్లును రిలీజ్ చేయాలని డైరెక్టర్ జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం ఆ పనులను చూసుకుంటున్నారు.
సినిమా మొదలై ఎంతో కాలమైనా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఇంకెంత టైమ్ పడుతుందోననే డౌట్ తో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చాడు. కానీ ఇప్పటికే ఇంపార్టెంట్ సీన్స్ మొత్తం ముందే షూట్ చేయడం వల్ల కొత్తగా డైరెక్టర్ కుర్చీలో కూర్చున్న జ్యోతికృష్ణకు పెద్దగా భారమేమీ ఉండదని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ ప్రస్తుతం పలు ప్రాంతాల్లో జరుగుతన్నట్లు నిర్మాత ఏఎం రత్నం తెలిపాడు.
బందర్ పోర్టులో తీసిన ఎపిసోడ్‌ను ఇరాన్ కంపెనీకి ఇవ్వగా అక్కడి టీమ్ కు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ రావడంతో వాళ్లనే ఇక్కడికి పిలిపించి దాన్ని పూర్తి చేస్తున్నారట. కుస్తీ ఫైట్ కు సంబంధించిన వర్క్ బెంగుళూరులో జరుగుతుండగా, ఛార్మినార్ సీక్వెన్స్ ను హైదరాబాద్‌లోనే ఎడిట్ చేయిస్తున్నారు. ఇక పులితో ఫైట్ చాలా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో కెనడాకు పంపి అక్కడ చేయిస్తున్నారట. పవన్ వీరమల్లు కోసం మరో 25 రోజులు డేట్స్ ఇస్తే సినిమా మొత్తం పూర్తవుతుందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. జులై లేదా ఆగస్ట్ నుంచి కుదిరినప్పుడల్లా వీరమల్లు కు డేట్స్ కేటాయించి ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడట పవన్.













