రీమేక్ కంటే ముందే హరిహర వీరమల్లు
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టి చాలా కాలమే అయింది. కరోనా ఇతర విషయాల వల్ల సినిమా చాలా కాలం పట్టింది. ఇప్పటికి కనీసం సగం షూటింగ్ కూడా పూర్తవలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 17 నుంచి తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
మొన్నటి వరకు పవన్ వినోదాయ సీతం రీమేక్ ముందు పూర్తి చేస్తాడనుకున్నారంతా. కానీ మధ్యలో ఉన్న హరిహర వీరమల్లును పక్కకు పెట్టి రీమేక్‌కు డేట్లు ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్ధేశ్యంతో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు టాక్.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ని మొదటి సారి పీరియాడికల్ ఫిక్షన్ మూవీలో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. గతేడాదిలో సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పటికీ సినిమా పూర్తి కాలేదు. దీనికి కారణం పవన్ కళ్యాణే అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే వచ్చే నెలలో ఏపీలో పవన్ పర్యటన ఉంటే షూటింగ్‌కు ఎలా వస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.













