హరిహర వీరమల్లు ఇప్పట్లో కష్టమే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రాధాన్యత క్రమంలో మూడు సినిమాలున్నాయి. ఓజి, ఉస్తాద్ భగత్‌సింగ్, ఆ తర్వాత సినిమా బ్రో. ఈ మూడు సినిమాల్లో చివర మొదలుపెట్టిన సినిమా బ్రో నే ముందుగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రీమేక్ కావడం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా లేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ చాలా త్వరగా పూర్తి చేయగలిగాడు సముద్రఖని.
మిగిలిన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో సుజిత్, హరీష్ శంకర్లకు ఆ విషయం ప్లస్ అవుతుంది. అయితే వీటి కన్నా ముందు మొదలైన పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు మీద బజ్ ఆల్మోస్ట్ నేలమట్టానికి పడిపోయింది. దీంతో నిర్మాత ఏఎం రత్నం, డైరెక్టర్ క్రిష్‌లు అడుగుదామన్నా బయట కనిపించట్లేదు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు లాంగ్ వెయిటింగ్ తప్పేలా లేదు. పవన్ ఈ నెలలో వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నాడు. పొలిటికల్‌గా యాక్టివ్ అవాల్సిన టైమ్ వచ్చేసింది. ఎన్నికలు కూడా కొంచెం ముందుగానే వచ్చేలా ఉన్నాయి. అదే నిజమైతే ఎలక్షన్ క్యాంపైన్‌కి వెళ్లాల్సి ఉంటుంది. జనసేన తరఫున జనానికి కనిపించాల్సింది తనే కాబట్టి షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి కచ్చితంగా వస్తుంది.
బ్రో మూవీ షూటింగ్ ఎలాగూ అయిపోయింది కాబట్టి, టైమ్ ఉంటే ఉస్తాద్ భగత్‌సింగ్‌కు డేట్లు దొరుకుతాయి. హరిహర వీరమల్లు కోసం మళ్లీ హెయిర్ పెంచాల్సి ఉంటుంది కాబట్టి పవన్ కు టైమ్ దొరికితే అది ఉస్తాద్కే ఉపయోగించబోతున్నాడు. కాబట్టి ఎలక్షన్స్ అయ్యేవరకు పవన్ హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొనడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.













