వీరమల్లు.. ఆ గుడ్న్యూస్కు నో ఛాన్స్!
పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒకటైన హరిహర వీరమల్లు మూవీపై గతేడాది వరకు పవన్ ఫ్యాన్స్ కు భారీ ఆశలు, అంచనాలుండేవి. కానీ ఆ సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ కావడం, మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణే స్వయంగా ఈ సినిమాను పక్కకు పెట్టి వేరే సినిమాలు చేయడంతో ఈ సినిమా ఆగిపోయిందా అనే డౌట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ టీమ్ లో కదలిక వచ్చిందని టాక్ వినిపిస్తోంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ ఫ్యాన్స్ కు కావాల్సింది పోస్టర్ కాదు. అసలు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడా అన్నది వారు తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఇన్సైడ్ టాక్ ప్రకారం, రేపు రిలీజ్ చేసే పోస్టర్ లో హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే ఛాన్స్ అసలు లేదని తెలుస్తోంది. వరుస సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్, ఇప్పుడు ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమే కాబట్టి అసలు మిగిలిన షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. రిలీజ్ చేసే పోస్టర్ లో మేకర్స్ ఎలాంటి సమాచారాన్నిస్తారో చూడాలి మరి.













