ఓ రేంజ్లో హను మాన్ బిజినెస్
సంక్రాంతికి రానున్న సినిమాల్లో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హను మాన్ కూడా ఒకటి. ఎంత పోటీ ఉన్నా సరే కాంప్రమైజ్ కాకుండా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో బిజినెస్ కూడా బాగానే జరిగిందని టాక్ వినిపిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్సే రూ.22 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.
తేజ లాంటి హీరోకు ఈ రేంజ్ రేట్ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ ఈ రేటు తేజను చూసి కాదు. హను మాన్ పై ఉన్న నమ్మకం. ఇన్సైడ్ టాక్ ప్రకారం, హను మాన్ ట్రైలర్ చూశాకే మెయిన్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొన్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు గుంటూరు కారంతో పోటీ ఎందుకని అన్న వాళ్లే ట్రైలర్ చూశాక తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారట.
మొదటి రోజు కలెక్షన్స్ లో కొంత కోత పడినా తర్వాత రోజు నుంచి హనుమాన్ కలెక్షన్లు విపరీతంగా పెరుగుతాయన్న నమ్మకం బయ్యర్లకు వచ్చిందట. దీన్ని బట్టి చూస్తుంటే డైరెక్టర్ ముందు నుంచి చెప్పినట్లు థియేటర్లలో హను మాన్ రచ్చ మామూలుగా ఉండేట్లు లేదు. ఈ సినిమా ఆడియోకు గొప్ప రెస్పాన్స్ రాకపోయినప్పటికీ, ట్రైలర్ తర్వాత హనుమాన్ క్రేజ్ భారీగా పెరగనుందని తెలుస్తోంది.













