వెనక్కి తగ్గేదేలే అంటున్న హనుమాన్
వచ్చే సంక్రాంతికి ఏ సినిమా వస్తుందో రాదో తెలియదు కానీ ఎవరికి వాళ్లే తమ సినిమా వస్తుందని చాలా ధీమాగా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బయ్యర్లు మాత్రం ఎవరో ఒకరు రేసు నుంచి తప్పుకుంటే బావుంటుందని ఆశ పడుతున్నారు. కానీ చిత్ర యూనిట్స్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదేలే అంటూ రిలీజ్ డేట్ గురించి అనౌన్స్ చేస్తున్నారు.
తాజాగా తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ చిత్రం నుంచి దసరా సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను వదులుతూ రిలీజ్ డేట్ గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సినిమా వాయిదా పడుతుందని చాలా మంది అనుకున్నారు కానీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాత్రం సంక్రాంతికి తమ సినిమా వచ్చి తీరుతుందని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు.
హనుమాన్ రిలీజ్ డేట్, గుంటూరు కారం రిలీజ్ డేట్ రెండూ ఒకటే రోజు. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా వస్తుందని తెలిసి కూడా హనుమాన్ మూవీని రిలీజ్ చేయడమంటే సాహసమనే చెప్పాలి. ఎంత మంచి కంటెంట్ అయినా సరే ముందు మహేష్ సినిమాకే ఆడియన్స్ ఓటేస్తారన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇలాంటి టైమ్ లో రిలీజ్ చేసి, సినిమా కలెక్షన్స్ ను తగ్గించుకోవడం ఎందుకని హనుమాన్ టీమ్ కు అందరూ సలహాలిస్తున్నప్పటికీ, హనుమాన్ మేకర్స్ మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు.













