హనుమాన్ అలా చేయడమే బెటర్
రోజురోజుకీ సంక్రాంతికి వచ్చే సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే ఆరుకు పైగా సినిమాలు ఈ పోటీలో నిలబడ్డాయి. కానీ సంక్రాంతికి రెండు, మహా అంటే మూడు సినిమాలకు మించి స్కోప్ ఉండదు. ఈ సంవత్సరం రెండు తెలుగు సినిమాలకు తోడు మరో రెండు డబ్బింగ్ సినిమాలు వస్తేనే థియేటర్లు దొరకడం ఇబ్బంది అయింది.
వాస్తవానికి సంక్రాంతి సీజన్లో మూడు సినిమాలు రిలీజైతే థియేటర్లను మేనేజ్ చేయొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ సినిమాలొస్తే ఆ ప్రభావం కలెక్షన్లపై ఎక్కువగా ఉంటుంది. నాన్నకు ప్రేమతో సినిమా కు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాకపోవడానికి కారణమిదే. పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు టాక్ బాలేని సినిమాకు నష్టం పెద్ద మొత్తంలో జరిగే అవకాశముంది.
ఇవన్నీ తెలిసి కూడా గుంటూరు కారం సినిమాతో పాటూ సైంధవ్, నా సామిరంగ, ఈగల్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ సినిమాలు సంక్రాంతికి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. వీటిన్నింటిలో గుంటూరు కారం సినిమా పక్కాగా వస్తుంది. సైంధవ్, ఫ్యామిలీ స్టార్ కూడా వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఆ సినిమాల వెనుక సురేష్ బాబు, దిల్ రాజు ఉన్నారు కాబట్టి థియేటర్ల సమస్య పెద్దగా ఉండకపోవచ్చు.
ఈగల్ సినిమా రావడం కష్టమేననిపిస్తుంది. ఈ మధ్య సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి రిలీజ్ డౌట్ గానే అనిపిస్తుంది. ఒకవేళ రిలీజ్ అయినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి బ్యానర్ దాని వెనుక ఉంది. ఎటొచ్చి హనుమాన్ సినిమాకే థియేటర్లు దొరకడం కష్టంగా అనిపిస్తుంది. సినిమా రెడీ అయినా థియేటర్లు దొరకడం కష్టం కాబట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడమే బెటరని అందరూ అంటున్నారు.













