చెప్పిన టైమ్‌కి రానున్న హనుమాన్
తన విజువల్ వండర్స్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే ప్రశాంత్ వర్మ చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో రానున్న సినిమా హనుమాన్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 11 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హనుమాన్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ టీజర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. ఈ టీజర్ వీఎఫ్ఎక్స్ చూసి ఆదిపురుష్ ను కూడా నెటిజన్లు ట్రోల్ చేశారు. హనుమాన్ వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని మూవీ లవర్స్ అనుకుంటున్నారు.
ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఏదో అద్భుతమే చేస్తాడని భావిస్తున్నారంతా. అయితే టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో సినిమా చెప్పిన టైమ్ కు వస్తుందా లేదా అనుమానాలోస్తున్నాయి. అదే టైమ్ లో మహేష్ గుంటూరు కారం, కమల్ ఇండియన్2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ముందు చెప్పిన డేట్‌కు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. రిలీజ్ డేట్ కు ఇంకా నాలుగు నెలల టైమ్ ఉండటం వల్ల ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టాలని చిత్ర బృందం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది.
పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్ కు ఎక్కువ టైమ్ పడుతుందనే నేపథ్యంలో అక్టోబర్ నుంచి ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే పబ్లిసిటీకి కావాల్సిన కంటెంట్ మొత్తం రెడీ అయిందని ఇన్సైడ్ టాక్. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ హనుమాన్ సినిమాను నిర్మిస్తోంది.













