హనుమాన్ టీమ్ రిస్క్ చేస్తుందా?
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ గ్రాండియర్ మూవీ హనుమాన్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా ఆదిపురుష్ కంటే ముందే రావాల్సింది కానీ గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్ లేట్ అవుతుందనుకున్నారు.
ఎలాగైనా ఇంకో రెండు నెలల్లో సినిమా రిలీజ్ అవుతుందనుకుంటే ఏకంగా సినిమాను వచ్చే సంక్రాంతికి షిప్ట్ చేశారు. ఒక అప్కమింగ్ హీరో మీద ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ఎలా పెట్టారనేది ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆశ్యర్యంగానే ఉంది. ఈ సినిమాకు ఇప్పటికే 25 నుంచి 40 కోట్ల వరకు బడ్జెట్ అయిందని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడం ఎంతవరకు సేఫ్ అనేది ఇప్పుడు అసలు పాయింట్.
ఇప్పటికే సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు క్యూ కట్టిన విషయం తెలిసిందే. ప్రభాస్-అమితాబ్-కమల్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సంక్రాంతికే రిలీజ్ కానుంది. అలాంటి టైమ్ లో తేజ సజ్జ లాంటి హీరోకి థియేటర్లు దొరకడమే చాలా కష్టం. ప్రాజెక్ట్ కె కాకుండా మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది.
రవితేజ నటిస్తున్న ఈగల్ ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ అయింది. దీంతో పాటూ చిరంజీవి, కళ్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అంటున్నారు. ఇంత గట్టి పోటీ మధ్య హనుమాన్ రిలీజ్ చేయడం ఎంత వరకు సేఫ్ అనేది అందరూ అంటున్నార. కానీ హనుమాన్ మేకర్స్ మాత్రం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో సంక్రాంతి సీజనే కరెక్ట్ అని భావిస్తున్నారు.













