హను మాన్ టికెట్స్ కావలెను!
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో అన్నింటికంటే చిన్న సినిమాగా రిలీజ్ కు ముందు హను మాన్ గురించి అందరూ ఎన్నో అనుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత హను మాన్ కథ మారిపోయింది. చూస్తుంటే హను మాన్ సినిమానే సంక్రాంతి విజేతగా నిలిచేట్లుంది. గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నాయి.
నా సామిరంగ రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమా హిట్ అయినా సరే హను మాన్ రిజల్ట్ లో పెద్దగా తేడా కనిపించదు. మంచి టాక్ తో దూసుకెళ్తున్న హను మాన్ టికెట్లకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ లో ఒకే థియేటర్లో మూడు నాలుగు టికెట్స్ కావాలంటే దొరికే పరిస్థితి కనిపించడం లేదు. బుక్ మై షో లో గంటకు సుమారు 25 వేల హను మాన్ టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
జనవరి 16 వరకు ఏ మెయిన్ థియేటర్లలో కూడా హను మాన్ టికెట్స్ అందుబాటులో లేవు. ఏపీలో స్క్రీన్లు పెంచినా కూడా థియేటర్లు సరిపోవడం లేదు. జనాలు మెచ్చని థియేటర్లు సైతం హను మాన్ పుణ్యమా అని కళకళ లాడుతున్నాయి. హను మాన్ డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.22 కోట్ల దాకా తెచ్చిందని సమాచారం. మొత్తానికి ఈ కలెక్షన్స్, టాక్, ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ తో హను మాన్ టీమ్ చాలా హ్యాపీ గా ఉంది.













