ప్రభాస్ లవ్ స్టోరీ మొదలయ్యేదప్పుడే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ లోపు సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటూ ప్రభాస్ మారుతి సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. ఇది కాకుండా ఇప్పుడు మరొక సినిమాపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. సీతారామం సక్సెస్ తర్వాత ఫామ్ లోకి వచ్చిన హను ప్రభాస్ ను బాగా ఎట్రాక్ట్ చేశాడు.
ప్రభాస్ కు హనూ ఓ మంచి లవ్ స్టోరీ చెప్ప ఒప్పించాడట. ఫైనల్ స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని టాక్. కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే హనూ, ప్రభాస్‌కు ఫుల్ నెరేషన్ ఇవ్వనున్నాడు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ బర్త్ డే అయిన అక్టోబర్ 2న క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ ఏడాది ఆఖర్లో మొదలుపెట్టే అవకాశముందట. మారుతి సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాలో నిమగ్నమవ్వాలని చూస్తున్నాడట ప్రభాస్. మరి హను దర్శకత్వంలో రాబోయే సినిమాతో ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













