హను మాన్ కు సీక్వెల్‌గా జై హను మాన్
రిలీజ్ ముందు రోజు హను మాన్ లాంటి ఒక చిన్న సినిమాకు భారీ సంఖ్యలో ప్రీమియర్లు వేయడం చూసి ట్రేడ్ పండితులంతా షాకయ్యారు. కానీ షో వేసిన ప్రతీ చోటా భారీ ఆక్యుపెన్సీతో అన్ని షోలకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి నుంచి ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ప్రశాంత్ వర్మ నమ్మకానికి తగ్గట్టే ప్రీమియర్ షో ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
హను మాన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది మరో వారం ఆగితే కానీ తెలియదు. హనుమాన్ మీద ఉన్న నమ్మకంతోనే దీనికి సీక్వెల్‌గా జై హనుమాన్ ని ఈ సినిమా క్లైమాక్స్‌లో అనౌన్స్ చేశారు. రిలీజ్ కూడా 2025లోనే తేల్చి చెప్పేశాడు ప్రశాంత్ వర్మ. అంటే నెక్ట్స్ ఇయర్ లోనే జై హనుమాన్ రిలీజ్ కానుందన్నమాట.
సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అందులో 12 సూపర్ హీరోల సినిమాలు చేస్తానని చెప్పిన ప్రశాంత్ వర్మ రెండో భాగంలో హనుమంతుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు హను మాన్ లో క్లూ కూడా ఇచ్చాడు. హను మాన్ ఎండింగ్ కార్డ్ కూడా పర్ఫెక్ట్ గా కట్ చేయడం వల్ల సీక్వెల్ పై ఇంట్రెస్ట్ కలిగించడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు.













