పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అంటున్న ఆపిల్ బ్యూటీ..!
ఒకప్పుడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చాలా విషయాలలో అనేవాళ్ళు. అమ్మాయిల విషయంలో అయితే ఈ పద్దతిని మరీ ఎక్కువగా పాటించేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా హీరోయిన్స్ కూడా ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఆపిల్ బ్యూటీ హన్సిక దుబాయ్ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని రీసెంట్ గా విదేశాల్లో హనీమూన్ ని కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట హనీమూన్ ఫోటోలు, పెళ్లి ప్రపోజల్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి
ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ తో రచ్చ రచ్చ చేసింది.
పెళ్లి ముందు ఎలా ఉన్నామో, తర్వాతా కూడా అలానే ఉండొచ్చు అనే మాటలని ప్రూవ్ చేస్తూ ఇప్పుడు హన్సిక లేటెస్ట్ ఫోటోషూట్ వేడెక్కిస్తోంది. సౌత్, నార్త్ ఇండస్ట్రీలో ఒకటిన్నర దశాబ్ధాల కెరీర్ ని కొనసాగించిన హన్సిక ఆపిల్ బ్యూటీగా అభిమానుల గుండెల్లో స్థిరపడింది. తెరంగ్రేటమే అల్లు అర్జున్ జంటగా ‘దేశముదురు’తో ఉత్తమ అరంగేట్ర నాయికగా సౌత్ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది అంటే మాములు విషయం కాదు.
రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా అప్ డేట్స్ లో చాలా స్పీడ్ చూపిస్తోంది ఆపిల్ బ్యూటీ . హన్సికా వైట్ టాప్ – స్లిట్ స్కర్ట్ ధరించిన తన ఫోటోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ అమ్మడి లేటెస్ట్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆపిల్ బ్యూటీ హాటెస్ట్ భంగిమలతో మతులు చెడగొట్టింది. “మీ సూర్యరశ్మిని సృష్టించండి” క్యాప్షన్ తో ఈ ఫోటోలను హన్సిక షేర్ చేసింది. పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అంటుంది ఈ భామ.













