హన్సికకు గాయాలు!
నటి హన్సికకు మహా షూటింగ్లో గాయాలయ్యాయి. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం మహా. యూనిట్ వర్గాల ప్రకారం.. సినిమాలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. హన్సిక మంచి ఎమోషన్తో నటించసాగారు. అనుకోకుండా ఆమె జారీ పడ్డారు. చేతికి బాగా గాయాలయ్యాయి. రక్తం కూడా చాలా పోయింది. షూటింగ్ ఆపేద్దామని, ఆసుపత్రికి వెళ్తామని మేం ఎంతో బతిమలాడాం. అయినా ఆమె అందుకు అంగీకరించలేదు. చేతికి బ్యాండేజ్ వేసుకుని నటించారు. ఆమె పోర్షన్ పూర్తయ్యాక ఇంటివెళ్లారు అని అన్నారు. మహా చిత్రానికి యుఆర్ జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు.













