సంక్రాంతికే వస్తుంది.. కన్ఫర్మ్ చేసిన మహేష్
మహేష్ కొత్త సినిమా గుంటూరు కారం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా బాగా ఉన్నాయి. ఈ సినిమా మేకర్స్ చెప్పినట్లు 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్లకు స్వయంగా మహేష్ బాబే చెక్ పెట్టాడు. బిగ్ సి రెండు దశాబ్దాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గుంటూరు కారం సినిమా కచ్ఛితంగా పండుగకు వస్తుందని మహేష్ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి ఇంకో 4 నెలలే టైమ్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో త్రివిక్రమ్ పూర్తి చేయబోతున్నాడని తెలుస్తోంది. రమ్యకృష్ణ డేట్స్ తో ఏదో ఇబ్బంది వచ్చిందని వార్తలొచ్చాయి కానీ అవి వాస్తవం కాదని సమాచారం.
హైదరాబాద్లో జరగనున్న కీలక షెడ్యూల్ లో రమ్యకృష్ణతో పాటూ మహేష్ కూడా పాల్గొంటున్నాడు. థమన్ ఇచ్చిన ట్యూన్స్ లో ఇప్పటికే రెండు సాంగ్స్ ఫైనల్ అయ్యాయట. ఫైనల్ రికార్డింగ్ పూర్తవగానే ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్డేట్ ను వదలనున్నారు. ఈ లిరికల్ సాంగ్ ఈ నెలాఖరుకి లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానుంది. ఒకేసారి ఇన్ని గుడ్ న్యూస్ లు విని మహేష్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇంత తక్కువ టైమ్ లో సినిమాను కంప్లీట్ చేయడమంటే కష్టమైనప్పటికీ ఈ టార్గెట్ ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుడదని మేకర్స్ డిసైడ్ అయ్యారు. గుంటూరు కారం సినిమాతో పాటూ ఈగల్, హనుమాన్ కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి.













