రెండు వెర్షన్స్‌లో గుంటూరు కారం మెలోడీ
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో అంతే భయంగా కూడా ఉన్నారు. దానికి కారణం తమన్. ఈ మధ్య ఆయన నుంచి వచ్చిన పాటలేవీ గొప్పగా క్లిక్ అవకపోవడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సాదాసీదాగా ఉంటుందని ఈ మధ్య తమన్ మీద కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గుంటూరు కారం కోసం తమన్ ఎలాంటి ట్యూన్ ఇస్తాడనేది ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుంది. త్రివిక్రమ్ మంచి ట్యూన్స్ ఇచ్చేవరకు ఎలాగూ వదలడు కాబట్టి థమన్ నుంచి మంచి పాటలే రెడీ చేయిస్తాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ గురించి కొన్ని లీక్స్ అందుతున్నాయి.
గుంటూరు కారం నుంచి ఫస్ట్ రిలీజ్ కాబోతున్న పాట మెలోడీ అని, ఈ మెలోడీని అనురాగ్ కులకర్ణి పాడాడని తెలుస్తోంది. అంతేకాదు, ఈ పాటను రెండు వెర్షన్స్ లో రాయించి, పాడించినట్లు తెలుస్తోంది. ఆ రెండిట్లో ఏది బాగుంటే దాన్ని ఫైనల్ చేసి త్వరలోనే ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం. ఎలాగూ ఫస్ట్ సింగిల్ దసరా కంటే ముందే రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ కూడా చెప్పారు కాబట్టి ఇది నిజమయ్యే అవకాశాలెక్కువే ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













