హైప్ పెంచడానికి గుంటూరు కారం టీమ్ ప్లాన్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నీ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే గుంటూరు కారం ప్రమోషన్స్ ను మేకర్స్ ఇప్పటికే మొదలుపెట్టారు.
ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన రెండు పాటలకు మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఎలాగైనా సరే ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. దానికి తగ్గట్టే ట్రైలర్ కట్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే విపరీతమైన అంచనాలను తెచ్చుకుంది. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉండేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
ఇప్పటివరకు మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా బాక్సాఫీస్ దగ్గర సరిగా వర్కవుట్ కాలేదు. దీంతో ఎలాగైనా సరే ఈ సారి కమర్షియల్ హిట్ అందుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడయ్యారట మహేష్, త్రివిక్రమ్. చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ చేయనున్నాడు. మరి మహేష్ ఫ్యాన్స్ అంచనాలను గుంటూరు కారం ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.













