గుంటూరు కారం ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సిందే
యానిమల్ సినిమాతో డిసెంబర్ నెల చాలా గ్రాండ్ గా మొదలైంది. ఈ వారం హాయ్ నాన్న, ఎక్స్ట్రా సినిమాలు రిలీజ్ కానున్నాయి. తర్వాత వారం గ్యాప్ ఉంది. ఆ తర్వాత వారం ప్రభాస్ సలార్, డంకీలతో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. నెలాఖరున కూడా ఏ సినిమా లేదు. దీంతో అందరి కన్ను ఆ తర్వాత రానున్న సంక్రాంతి సినిమాలపైనే ఉంది.
సంక్రాంతికి ఇంకా పట్టుమని నలభై రోజుల టైమ్ ఉంది. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న సినిమాలన్నీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ బరిలో ఉన్న సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ హైప్ ఉన్న సినిమా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం టీజర్, ఫస్ట్ లిరికల్ మాత్రమే వచ్చాయి.
సినిమా నుంచి రావాల్సిన లిస్ట్ చాలా పెద్దగా ఉంది. మూడు పాటలతో పాటూ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇలా అన్నీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందంటున్నారు కానీ తమన్ చేతికి కాపీ ఇస్తేనే రీరికార్డింగ్ విషయంలో వేగం పుంజుకుంటుంది. వీటన్నింటినీ ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసుకుని, జనవరి మొదటి వారానికల్లా సెన్సార్ ఫినిష్ చేసుకునే వరకు గుంటూరు కారం టీమ్ పరుగులు పెట్టాల్సిందే. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గుంటూరు కారం మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తే బెటర్.













