Indian Idol 4: గ్రాండ్ గా జరిగిన ఆహా ఓటీటీ ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంఛ్ ఈవెంట్
ఆహా (Aha) ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందిన మ్యూజికల్ ప్రోగ్రాం ఇండియన్ ఐడల్. ఈ షో ఫోర్త్ సీజన్ కు రెడీ అయ్యింది. ఇండియన్ ఐడల్ సీజన్ 4 లాంఛింగ్ ఈవెంట్ బిగ్ బుల్ లో ఘనంగా జరిగింది. జడ్జిలు తమన్, కార్తీక్, గీతా మాధురి, హోస్ట్స్ సమీర, శ్రీరామ చంద్ర ఈ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని పర్ ఫార్మ్ చేశారు.
తమన్ ఇండియన్ ఐడల్ క్యాంపేన్ సాంగ్ ను ఈ సందర్భంగా అఫీషియల్ గా లాంఛ్ చేశారు. సింగర్ కార్తీక్ ఈ కార్యక్రమం కోసం గల్లీ టు గ్లోబల్, మనమే రా ఐడల్ అనే థీమ్ ను ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ లో ఇండియన్ ఐడల్ షోకు సంబంధించిన వీడియోస్, మెమొరీస్ ప్రదర్శన ఆకట్టుకుంది. జడ్జీలు, హోస్ట్ లు ఈ కార్యక్రమం గురించి తమ ఆలోచనలు, పాల్గొనబోతున్న టాలెంటెడ్ సింగర్స్ విశేషాలు షేర్ చేసుకున్నారు.







