సమ్మర్ స్పెషల్‌గా సీటీమార్
గోపీచంద్ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి సీటీమార్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తమన్నా, దిగంగనా సూర్యవన్షీ కథానాయికలు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ఇటీవలే హైదరాబాద్, రాజమండ్రిలో భారీ షెడ్యూల్స్ పూర్తిచేశాం. నేటి నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలు పెట్టాం. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తిచేస్తాం. వేసవిలో విడుదల చేస్తాం అన్నారు. ఇందులో ఆంధ్ర మహిళా కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా కనిపిస్తారు. క్రీడా నేపథ్యంలో సాగే భావోద్వేగభరిత కథాంశమిది. ప్రతి సన్నివేశం హృదయాన్ని స్పృశిస్తుందని అని దర్శకుడు తెలిపారు.













