నాగార్జునతో వద్దని రానాతో ఢీ అంటున్న గోపీచంద్ !
సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా కబడ్డీ నేపథ్యంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్”. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా పాటలకు మంచి స్పందన లభించింది. దర్శకుడు సంపత్ నంది మరియు గోపీచంద్ ల కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ వచ్చే వారం ఏప్రిల్ 2వ తారీఖునే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొంత గ్రాఫికల్ వర్క్ బ్యాలన్స్ ఉండటం వలన వాయిదా పడింది.
గోపీచంద్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులవుతోంది. గౌతం నంద సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు సినిమా రాకపోవడంతో ప్రస్తుతం తెరకెక్కిన సీటిమార్ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఆంధ్రా జట్టుకు గోపీచంద్..తెలంగాణ జట్టుకు తమన్నా కోచ్‌లుగా కనిపించబోతున్నారు. చిత్ర యూనిట్ ఈమధ్యే జ్వాలా రెడ్డి, పెప్సీ ఆంటీ సాంగ్స్ ని రిలీజ్ చేసి సినిమా మీద భారీగా అంచనాలు పెంచారు. ప్రేక్షకుల్లో కూడా సినిమా మీద బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. కాకపోతే ఈ చిత్రం కొంత గ్రాఫికల్ వర్క్ బ్యాలన్స్ ఉండటం వలన వాయిదా పడింది.
కానీ మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ఇంకా సస్పెన్సు గానే ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రం విడుదలపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏప్రిల్ 30న విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ మాసంలో అక్కినేని నాగార్జున చిత్రం వైల్డ్ డాగ్ 2 వ తేదీన, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం వకీల్ సాబ్ 9 న, అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన శేఖర్ కమ్ముల చిత్రం 16 న మరియు నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ చిత్రం 23 న విడుదల తేదీలు ముందే ఖరారు చేసుకోవటంతో ‘ సీటీ మార్ ‘ చిత్రం విడుదల చేయటానికి సరైన తేదీ ఏప్రిల్ 30 సరైన తేదీ అని భావిస్తున్నట్లు సమాచారం. కాకపోతే రానా నటించిన విరాట పర్వం అదే రోజున విడుదల కాబోతుంది.వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాట పర్వం సినిమా లో సాయి పల్లవి ఉండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ ‘ సీటిమార్’ చిత్ర యూనిట్ విడుదలపై అధికారికంగా ఎపుడు ప్రకటన చేస్తుందో చూడాలి.













