నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ కు అడ్వాన్స్ రిటర్న్ చేసిన హీరో గోపీచంద్
అవును మీరు విన్నది నేను అన్నది నిజమే.. సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత లేదా ఇంకొన్ని షూటింగ్ దశలో ఉండగా ఆగిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే యాక్షన్ హీరో గోపీచంద్ కు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది అని తెలుస్తోంది. ఓ సినిమా కోసం నిర్మాత దగ్గర తీసుకున్న రూ.2 కోట్ల అడ్వాన్స్ ను తిరిగిచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది. గోపీచంద్ ఇంతకు ముందు ఈ బ్యానర్ లో సాహసం అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ బిను దర్శకత్వం వహిస్తాడని తెలిసింది.
అయితే ప్రస్తుతం ఆ సినిమా మొదలు కాకుండానే ఆగిపోయిందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయినట్టు సమాచారం. దాంతో తాను తీసుకున్న అడ్వాన్సు మొత్తాన్ని ఆ చిత్ర నిర్మాతకు గోపీచంద్ తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఆగిపోవాడానికి గల కారణం మాత్రం వెల్లడికాలేదు.ప్రస్తుతం హీరో గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో “సీటీమార్” అనే చిత్రం షూటింగ్ దశలో వుంది. స్పోర్ట్ బాక్గ్రౌండ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా ఇద్దరు కూడా రెండు వేర్వేరు కబడ్డీ జట్లకు కోచ్ లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా 20 శాతం షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.













