రజనీ మూవీలో గోపీచంద్ ?
గోపీచంద్‌తో రెండు సినిమాల్ని తెరకెక్కించిన దర్శకుడు శివ. ఆయన తమిళంలో అగ్ర కథానాయకులతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ దర్శకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో గోపీచంద్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్టు తమిళ చిత్ర పరివ్రమ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా అయితే చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ చేస్తున్నారు. తేజ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేయడానికి ఒప్పుకున్నారు.













