‘సీటీమార్’ రీలీజ్ డేట్ ఫిక్స్
గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం సీటీమార్. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ చిత్రం స్పోర్టస్ అండ్ మాస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంది. ఈ చిత్రం రీలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో మంచి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నట్టుగా గోపీచంద్ కనిపిస్తున్నాడు. నిర్మాత మాట్లాడుతూ స్పోర్టస్ డ్రామాగా రూపొందిన చిత్రమిది. క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం ఎలా ఉండాలో, అదే స్థాయిలో ఉంటుందీ చిత్రం. గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకి కోచ్‌గా తమన్నా తెలంంగాణ జట్టుకి కోచ్‌గా కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి, పాటలకి మంచి స్పందన లభించింది. మాస్ అంశాల్ని పక్కాగా మేళవించి, ప్రతి సన్నివేశాన్నీ ప్రత్యేక హంగులతో తెరకెక్కించాం. కచ్చితంగా మా చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని పంచుతుంది అన్నారు. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా శ్రీనివాస సిల్వర్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.













