గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం
గోపీచంద్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను ఇండియాతో పాటు నేపాల్, కాంబోడియా, థాయ్‌లాండ్‌లో చిత్రీకరిస్తారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సతీశ్ కురుప్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ సహా మిగిలిన నటీనటులను త్వరలోనే తెలియజేస్తామని సినిమా యూనిట్ తెలియజేసింది. సాహసం తర్వాత గోపీచంద్, బివిఎస్ఎన్ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది.













