Goparaju Ramana: తండ్రి సినిమాలకు కొడుకు వాయిస్
మిడిల్ క్లాస్ మెలోడీస్(Middle Class Melodies) సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన గోపరాజు రమణ(Goparaju Ramana)కు ఆ సినిమా వల్ల మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆయనకు పలు సినిమాల్లో వరుస ఆఫర్లొచ్చాయి. గత నాలుగైదేళ్లలోనే రమణ పదుల సంఖ్యలో సినిమాలు చేశాడు. కానీ రీసెంట్ గా ఆయనకు ఆరోగ్యం బాలేక హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.
రమణకు బైపాస్ సర్జరీ జరగడంతో కొన్ని నెలలుగా ఆయన సినిమాలు చేయకుండా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తను నటించిన సినిమాలకు సైతం డబ్బింగ్ చెప్పలేకపోవడంతో దర్శకనిర్మాతలకు అదో పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రమణకు ఆయన వాయిస్ బాగా ప్లస్. అలాంటి ఆయన పాత్రకు వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పిస్తే అది సూటవదు.
అందుకే గోపరాజు రమణతో పూర్తి చేసిన సినిమాలకు ఆయన కొడుకు గోపరాజు విజయ్(Goparaju Vijay) తో డబ్బింగ్ చెప్పించి ఆ సినిమాలను పూర్తి చేశారు మేకర్స్. ఈ విషయం ఇప్పుడు చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. గోపరాజు విజయ్ కూడా నటుడే అవడం దానికి తోడు ఆయనది కూడా మంచి బేస్ వాయిస్ అవడం, తండ్రి వాయిస్‌కు దగ్గరగా ఉండటంతో విజయ్ తో తన తండ్రి పాత్రకు డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది. కమిటీ కుర్రాళ్లు, స్వాగ్ తో కలిపి 5 సినిమాల్లోని రమణ వాయిస్‌కు కూడా విజయే డబ్బింగ్ చెప్పాడట.













