Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ఇంటర్నేషనల్ హీరోగా త్వరలోనే మారనున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వారణాసి(Varanasi) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మొన్నామధ్య టైటిల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
టైటిల్ గ్లింప్స్ తోనే వరల్డ్ వైడ్ గా వారణాసికి బాగా క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ టైటిల్ గ్లింప్స్ ను యూట్యూబ్ లో చూడటం, ఆ రోజు లైవ్ ఈవెంట్ లో చూడటం తప్పించి థియేటర్లలో బిగ్ స్క్రీన్స్ లో చూసింది తక్కువ. ఏదో ఒకటీ రెండు స్క్రీన్స్ లో కొందరు పర్సనల్ గా గ్లింప్స్ ను ప్లే చేస్తున్నారు కానీ అన్ని స్క్రీన్స్ లో ఈ వారణాసి గ్లింప్స్ వచ్చింది లేదు.
ఈ విషయంలో మహేష్(mahesh) ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు. అయితే ఇప్పుడు వారికో సూపర్ ట్రీట్ రాబోతుంది. డిసెంబర్ 31న మురారి(Murari) రీరిలీజ్ సందర్భంగా ఆ సినిమా స్క్రీన్స్ లో వారణాసి గ్లింప్స్(Varanasi Glimpse) ను ప్లే చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో గ్లింప్స్ సెన్సార్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నిజమెంతన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని ఫుల్ ఖుషీ అవుతున్నారు.






