ప్రతినిధి-2కి భలే ఛాన్స్
నారా రోహిత్ కెరీర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా ప్రతినిధి. సెన్సిబుల్ అంశాన్ని తీసుకుని సీఎం కిడ్నాప్ ని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకుని చేసిన సినిమా కమర్షియల్ గా కూడా బాగా వర్కవుట్ అయింది. ఆ సినిమాలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థను టార్గెట్ చేసిన కౌంటర్స్ బాగా పేలాయి. ఈ సినిమాకు సీక్వెల్ గా దశాబ్ధం తర్వాత ప్రతినిధి-2ని కొన్ని నెలల కిందట ప్రారంభించిన సంగతి తెలిసిందే.
టీవీ5 మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్తమాన రాజకీయాలను స్పృశిస్తూ సినిమాను రూపొందిస్తున్నామని, జనవరి ఆఖరిలో సినిమాను రిలీజ్ చేస్తామని మొదట్లో అన్నారు కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి సౌండే లేదు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. ఈలోపు యాత్ర2, వ్యూహం, రాజధాని ఫైల్స్ వచ్చి పోయాయి.
ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా పెట్టుకుని సొంత అజెండాతో తీసినవి తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కానీ ప్రతినిధి2 విషయం వేరు. ఈ సినిమా సీరియస్ బ్యాక్ డ్రాప్ లో తీసుకున్నది. నిజ జీవిత పాత్రలను తీసుకుని స్పూఫ్, మేకప్‌లు వేయించి వెటకారాలు లాంటివి ఉండవు. సబ్జెక్టు వర్తమాన రాజకీయాలకు సంబంధించినదే అయినప్పటికీ కమర్షియల్ టచ్ తో ప్రశ్నించే రీతిలో ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఏపీ ఎలక్షన్స్ కు ఇంకా రెండు నెలల టైముంది కాబట్టి ఈలోగా ప్రతినిధి2 టీమ్ కాస్త స్పీడప్ చేసి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తే ఓటర్లను ఆలోచింప చేసిన వారవుతారు.













