Sekhar Kammula: శేఖర్ కు ఇదే మంచి ఛాన్స్

కుబేర(kubera) సినిమా విజయోత్సవ సభకు చీఫ్ గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఆ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులో భాగంగానే ఏషియన్ ఫిల్మ్స్(asian films) నారాయణ దాస్(narayana das) తో తనకు ప్రత్యేక బాండింగ్ ఉందని, ఆ తర్వాత సునీల్ నారంగ్(suneel narang) తో కూడా అదే అనుబంధం ఏర్పడిందని, ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మూడో తరంగా జాన్వీ(jaanvi) వచ్చిందని చిరూ అన్నాడు.
కుబేర ఈవెంట్ లో భాగంగా చిరూ(Chiru), ఏషియన్ ఫిల్మ్స్ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు వెల్లడించాడు. ఏషియన్ ఫిల్మ్స్ తో కలిసి ఓ సినిమా చేయాలని సునీల్ నారంగ్ తననెప్పటి నుంచో అడుగుతున్నాడని, మనం సినిమా చేస్తున్నామని జాన్వీతో అన్నాడు. అయితే తనకు ధనుష్(Dhanush) లాంటి ఛాలెంజింగ్ రోల్స్ వద్దని, మాస్, గ్లామర్, ఫన్ ఓరియెంటెడ్ పాత్రలనే చూడమని సరదాగా అన్నాడు చిరూ.
దీంతో చిరూ, ఏషియన్ ఫిల్మ్స్ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నిర్మాతలు ఇప్పుడు అర్జెంటుగా ఓ మంచి డైరెక్టర్ మరియు స్క్రిప్ట్ ను వెతకాలి. ఇప్పటికే కుబేరతో చిరూని ఆకట్టుకున్న శేఖర్(sekhar kammula) దగ్గర చిరంజీవి కోసం ఏదైనా స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఆ సినిమా వెంటనే కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే శేఖర్ తన తర్వాతి సినిమాను కూడా ఏషియన్ ఫిల్మ్స్ లోనే చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడు. కాబట్టి మంచి స్క్రిప్ట్ ఉంటే చిరూతో శేఖర్ సినిమా చేసే అవకాశముంది. మరి ఈ అవకాశాన్ని శేఖర్ కమ్ముల ఏ మేరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.