ముగిసిన గొల్లపూడి అంత్యక్రియలు
దిగ్గజ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు పార్థీవదేహానికి అదివారం అంత్యక్రియలు ముగిశారు. ఆయనకి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, తెలుగు ప్రముఖులు కన్నీటీ వీడ్కోలు పలికారు. గురువారం ఉదయం మారుతీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. స్థానిక టీ.నగర్లోని నివాసం నుండి అంతిమాయాత్ర నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ నిర్మాతలు ఏకాంబరేశ్వరరావు, కాట్రగడ్డ ప్రసాద్, పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు గొల్లపూడి భౌతికకాయానికి నివాళులర్పించారు.













