గోల్డెన్ గ్లోబ్ విజేతలు వీరే….
1943 నుంచి కొనసాగుతున్న ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2020 అవార్డుల వేడుక హాలీవుడ్ తారల నడుమ వైభవంగా జరిగింది. ఏడాది కాలంలో సినమా, టెలివిజన్ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి హాలీవుడ్ ప్రెస్ అసోసియేషన్ ఈ అవార్డులను అందజేస్తుంది. ఈ వేడుకలో నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో 1917కు రెండు అవార్డులు వరించాయి. విదేశీ విభాగంలో పారాసైట్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. గోల్డెన్బ్లోబ్ అవార్డ్ అందుకొన్ని మొదటి సౌత్‌కొరియా సినిమా ఇది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన జోకర్ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాక్విన్ ఫోన్సిక్ పురస్కారం అందుకున్నారు. మ్యూజికల్ కామెడీ విభాగంలో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది.













