స్పై మూవీకి గోల్డెన్ ఛాన్స్
ఇంకా కేవలం పదే పది రోజుల్లో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన స్పై మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కు రెడీ అయింది. నిఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీని ఇంత హడావిడిగా రిలీజ్ చేయడం ఏ మాత్రం ఇష్టం లేని నిఖిల్ ముందుగా సినిమా ప్రమోషన్ల విషయంలో సుముఖుత చూపించినా, రిలీజ్ డేట్ విషయంలో ప్రొడ్యూసర్ మాట వినకపోవడంతో చేసేదేమీ లేక నిఖిల్ కూడా సర్దుకుపోతున్నాడు.
నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు మేకర్స్. దగ్గుబాటి రానాతో ఓ చిన్న క్యామియో చేయించి, దానికి సంబంధించిన షూట్ ను కూడా కంప్లీట్ చేశారు. ఒకటి రెండు రోజుల్లో నిఖిల్ డబ్బింగ్ చెప్పడం కూడా అయిపోతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది సినిమా ప్రమోషన్స్.
టైం లేకపోవడంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆదిపురుష్ మానియా ఈ రెండ్రోజుల్లో తగ్గిపోతుంది. తర్వాత ఎలాగూ సినిమాలు లేవు. ఆదిపురుష్ సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇదే కాబట్టి స్పై కి ఇది చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. అందుకే నిర్మాత ఈ రిలీజ్ డేట్ ను వదులుకోవాలనుకోవట్లేదు.
యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి నార్త్ ఆడియన్స్ కూడా ఇలాంటి జానర్ లో వచ్చే సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నీ బాగుండి స్పై మూవీకి మంచి టాక్ వస్తే ఇక నిఖిల్ కు ఢోకా ఉండదు. కాకపోతే ఈ పది రోజులు అన్నీ మానేసి ప్రమోషన్స్ గట్టిగా చేయాల్సి ఉంటుంది. కార్తికేయ2 ఇమేజ్ నిఖిల్ కు ఎలాగూ ఉంది కాబట్టి అది కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ కు హెల్ప్ అవుతుంది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్‌ను స్పై ఎలా టీమ్ ఎలా వాడుకుంటారో చూడాలి.













