గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఫస్ట్‌లుక్
వైవిధ్యమైన వెబ్ సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్న జి4 యాప్ వారు మరో కొత్త వెబ్ సిరీస్‌ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 23న గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే డిఫరెంట్ టైటిల్‌తో ఒక థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ ని జి-5 యాప్ వారు టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరిస్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా సెన్షేనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు. వెబ్ సిరీస్‌ని ఏళ్లన్నార్ ఫిలిమ్స్ పతాకంపై లక్ష్మి లావు నిర్మించారు. సత్యదేవ్, రాజ్‌శెట్టి, శృతి ముఖ్యపాత్రలుగా నటించిన ఈ వెబ్ సిరిస్‌కి అనీష్ కురువిళ్ళ దర్శకత్వం వహించారు.













