దేవుడు.. దెయ్యం… సైన్స్.. ఏది నిజం?
ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతి ప్రధానపాత్రల్లో కొమారి జానకి రామ్ తెరకెక్కించిన చిత్రం జీఎస్టి. గాడ్ సైతాన్ టెక్నాలజీ అన్నది ఉప శీర్షిక. కొమారి జానయ్య నాయుడు నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కాటికాపరి పట్టపగలు వెంకట్రావు చేతుల మీదుగా ఇటీవల విడుదల చేయించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ సమాజంలో దేవుడు, దెయ్యం, ఉన్నాయని కొందరు, ఏమీ లేవు సైన్స్ మాత్రమే వాస్తమని మరికొందరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. అసలు ఈ మూడింటిలో ఏది వాస్తవమనేది ఈ చిత్రంలో చర్చిస్తున్నాం. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. సంగీతం: యు.వి.నిరంజన్, ఛాయాగ్రహణం: డి.యాదగిరి.













