విజయ్ సినిమాకు ఇంత సెలెన్స్ ఏంటి?
మరో వారం రోజుల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన గోట్ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇంకా కావాల్సినంత హైప్ రాలేదు. మామూలుగా అయితే విజయ్ సినిమా రిలీజవుతుందంటే చాలు ఎక్కడలేని హడావిడి ఉంటుంది. కానీ ఈసారి గోట్ సినిమా విషయంలో ఆ హైప్, హడావిడి కనిపించడం లేదు.
అయితే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ రాకపోవడానికి రెండు కారణాలు. అందులో మొదటిది డైరెక్టర్ వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డు. ఆయన గత సినిమా నాగచైతన్యతో తీసిన కస్టడీ డిజాస్టర్ అయింది. రెండో కారణం విజయ్ సినిమాల రేంజ్ ను అనిరుధ్ తన మ్యూజిక్ తో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడు కానీ ఈసారి అనిరుధ్ ప్లేస్ లో యువన్ శంకర్ రాజా ఉన్నాడు.
పాటలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ అవలేదు కాబట్టి బజ్ ను పెంచడంలో అవి కూడా కీలకపాత్ర పోషించలేకపోతున్నాయి. వీటికి తోడు విజయ్ డీ- ఏజింగ్ మీద వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా ఈ సినిమాకు డ్యామేజ్ ను కలిగిస్తున్నాయి. తమిళంలో ఇప్పటికే గోట్ కు నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తున్నారు కానీ తెలుగులో ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఎలాగూ విజయ్ హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేయడు కాబట్టి మిగిలిన కీలక నటీనటులతో అయినా ఆ ప్రమోషన్స్ ను చేయాలని చూస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తూ చేయబోయే ఆఖరి సినిమాల్లో ఒకటిగా వస్తున్న గోట్ కు విపరీతమైన బజ్ ఉంటుందనుకుంటే దానికి భిన్నంగా అసలు ఏ మాత్రం సౌండ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.













