ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌ను సొంతం చేసుకున్న రామ్ చరణ్
ది ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) రంగం సిద్ధమైంది. టీ 10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇన్నిరోజులు వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లు ఇప్పుడు మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంచలనానికి తెర తీశారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో హైదరాబాద్ టీమ్‌ని ఆయన సొంతం చేసుకున్నారు. చరణ్‌తో పాటు అక్షయ్ కుమార్ (శ్రీనగర్), హృతిక్ రోషన్ (బెంగళూరు), అమితాబ్ బచ్చన్ (ముంబై) వంటి స్టార్స్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో భాగమయ్యారు. ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయటానికి పలు టీమ్స్‌ని సొంతం చేసుకోవటం విశేషం. హైదరాబాద్ టీమ్‌ని చరణ్ సొంతం చేసుకోవటం ద్వారా మన భాగ్యనగరంలో క్రికెట్ స్ఫూర్తిని రగిలించటానికి సిద్ధమయ్యారు.
Players are encouraged to register here: www.ispl-t10.com
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో తొలి ఎడిషన్ మార్చి 2 నుంచి మార్చి 9 వరకు ముంబై నగరంలో జరనుంది. ఇందులో ఆరు టీమ్స్ – హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్) మధ్య ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని పెంపొదించేలా 19 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
అండర్ 19 ఏజ్ గ్రూప్ కేటగిరీ నుంచి కనీసం ఒక ఆటగాడిని పదకొండు మంది ఉన్న టీమ్‌లో చేర్చడం మినహా ఎటువంటి వయస్సు పరిమితులు లేవు. ISPL దేశవ్యాప్తంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సరికొత్త వేదికగా మారనుంది.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో భాగం కావటంపై రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘ఐఎస్పీఎల్లో భాగం కావటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. క్రికెట్లో ఎంటర్టైన్మెంట్ను ఇది సరికొత్త పుంతలు తొక్కించనుంది. అసాధారణమైన క్రికెట్ ప్రతిభను హైదరాబాద్ ముందు నుంచి కేంద్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో ప్రతిభను నిరూపించుకోవటానికి ఈ క్రికెట్ లీగ్ ఒక గొప్ప వేదికగా కనిపించనుంది. నేను హైదరాబాద్ టీమ్‌ను సొంతం చేసుకోవటం నాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. మన నగరానికి క్రికెట్ ఆటపై ఉన్న ఆసక్తిని ప్రదర్శించడానికి ఇదొక గొప్ప వేదిక’’ అన్నారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) ప్రధాన కమిటీ సభ్యుడు ఆశిష్ షెలార్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో రామ్ చరణ్ వంటి వ్యక్తి భాగం కావటం అనేది లీగ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుందనటంలో సందేహం లేదు. ఆయనకున్న స్టార్ పవర్, క్రికెట్ ఆట పట్ల ఆయనకున్న అభిరుచి కారణంగా హైదరాబాద్ నగరంలోని యువత స్ఫూర్తి పొందుతారు. దీంతో యువత తమ ప్రతిభను టోర్నమెంట్లో నిరూపించుకోవటానికి భారీగా నమోదు అవుతారు. మా ఈ కలయిక విజయవంతం కావాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఈ వేదికపై ఎగ్జయిట్మెంట్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నామని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను’’ అన్నారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) కమిటీ ప్రధాన సభ్యుడు అమోల్ కాలే మాట్లాడుతూ ‘‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) కేవలం క్రికెట్ లీగ్ మాత్రమే కాదు.. టాలెంట్, క్రీడాస్ఫూర్తిని చాటే ఓ పండుగ అని చెప్పొచ్చు. ఇలాంటి లీగ్‌లో రామ్ చరణ్ భాగం కావటం అందరికీ కొత్త శక్తినిస్తుంది. హైదరాబాద్ ఆటగాళ్లారా.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.. ఈ సీజన్‌ను మరుపురాని సీజన్‌గా మార్చండి’’ అన్నారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) కమీషనర్ సూరజ్ సమత్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ టీమ్‌తో రామ్ చరణ్‌గారి అసోసియేషన్ అనేది ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని మరింత పెంపొందిస్తుంది. టీమ్‌పై ఆయన పెట్టుకున్న నమ్మకం, ఆయన చరిష్మా కారణంగా ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవటానికి అనూహ్యమైన ఆటతీరుని కనపరుస్తారనటంలో సందేహం లేదు. ఢీ అంటే ఢీ అనే థ్రిల్లింగ్ పోటీతత్వాన్ని హైదరాబాద్ టీమ్ నుంచి మేం ఎదురు చూస్తున్నాం. చరణ్‌తో కలిసి హైదరాబాద్ టీమ్ సరికొత్త ముద్రను వేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం సన్నద్ధమవుతోంది. లీగ్‌లో పాల్గొనాలనుకునే ఔత్సాహిక ఆటగాళ్లు ఐఎస్పీఎల్ అధికారిక వెబ్ సైట్లో రిజిష్టర్ చేసుకుని సిటీ ట్రైల్స్ కార్యక్రమంలో పాల్గొనటానికి గోల్డెన్ టికెల్ అవకాశాన్ని దక్కించుకోవాలి. ట్రయల్స్ జరగబోయే ప్రాంతం, దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రతిభను నిరూపించుకోవాలనుకునే ఔత్సాహిక క్రికెటర్స్‌కు గ్రౌండ్లో నిరూపించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది ఐఎస్పీఎల్.
Players are invited to register for the tournament here: www.ispl-t10.com













