Ghaati: ఘాటీ రిలీజ్ డేట్ తో కొత్త అనుమానాలు
అనుష్క శెట్టి(anushka shetty) టైటిల్ రోల్ లో నటిస్తున్న ఘాటి(Ghati) సినిమా ఏప్రిల్ 18న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న విషయాన్ని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్(UV Creations) చిన్న వీడియో ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. క్రిష్(Krish) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్క(Anushka)ని ఎప్పుడూ చూడనంత వయొలెంట్ గా క్రిష్ చూపిస్తున్నాడు.
ఇదంతా పక్కన పెట్టి అసలు విషయానికొస్తే ఘాటి ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్నట్లు చెప్పడంతో కొత్త డౌట్లు వస్తున్నాయి. ఏప్రిల్ 10న ప్రభాస్(Prabhas) ది రాజా సాబ్(The Raja Saab) ఇప్పటికే అనౌన్స్ అయింది. జస్ట్ వారం గ్యాప్ లో తమ బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రభాస్ సినిమాతో యువి నిర్మాతలు(UV Producers) తమ సినిమాను పోటీకి దింపరు కాబట్టి రాజా సాబ్ వాయిదా వార్తలు నిజమేనేమో అనే అనుమానం కలుగుతుంది.
ఒకవేళ రాజా సాబ్ రాకపోతే ఆ డేట్ లో విశ్వంభర(Viswambhara) వస్తుందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. విశ్వంభర, ఘాటి రెండు సినిమాలూ యువి సంస్థవే కాబట్టి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేస్తారనుకోలేం. ఇప్పటికే ఏప్రిల్ 18న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media Factory) మిరాయ్(Miraai) ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఘాటికి మిరాయ్ తో క్లాష్ అవుతున్నట్లయితే క్లారిటీ వచ్చేసింది. ఇవన్నీ చెప్పిన డేట్ కు కట్టుబడి ఉంటాయని చెప్పలేం కానీ ఇప్పటికైతే పోటీ మాత్రం ఇదే.













