యాక్షన్ సీక్వెన్స్ కు ‘సిద్ధ’మవుతున్నాడు..
రాజమౌళి డైరక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూనే, మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ రెండు సినిమాలను చరణ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ లో స్వాతంత్ర్య సమరయోధుడైన అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న చరణ్, ఆచార్యలో మాత్రం సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ రెండు సినిమాలూ రిలీజ్ డేట్లు ప్రకటించడంతో ఎంతో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఆచార్య, ఆర్ఆర్ఆర్ లు రెండూ సినిమా చివరి దశలోనే ఉండటం విశేషం. రాజమౌళి సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే కానీ కొరటాల దర్శకత్వంలో వచ్చే సినిమాలో రామ్ చరణ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆచార్యలో రామ్ చరణ్ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇది వరకు ఎప్పుడూ చూడని యాక్షన్ సీన్స్ లో రామ్ చరణ్ కనిపించనున్నాడని, కొరటాల సినిమాలో ఫైట్స్ చాలా స్టైలిష్ ఉంటాయని తెలిసందే. అలాంటిది మెగా స్టార్ హీరోగా రానున్న సినిమాలో అంటే ఇక ఏ రేంజ్ లో ఉంటాయో అని ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఆచార్యలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తుందటే, చరణ్ కీలక పాత్ర చేస్తున్నాడు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మే 13న రిలీజ్ కానున్న ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.













