ఈ సంక్రాంతి పండుగను జీ తెలుగుతో ఆనందంగా జరుపుకోండి…
జీ తెలుగు కుటుంబ సభ్యులు మరియు మృణాల్ ఠాకూర్ సందడి చేసిన సంక్రాంతి సంబరాలు జనవరి 14 మరియు 15 తేదీల్లో..
హైదరాబాద్, 11 జనవరి 2023: 2022 ఏడాదిలో అద్భుతమైన సీరియల్స్, సూపర్‌హిట్ కార్యక్రమాలు మరియు సినిమాలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది జీ తెలుగు. అంతేకాకుండా పండుగల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలతో కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు కొత్త ఏడాది 2023లో కూడా ఆడియన్స్‌కు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సంక్రాంతి పండుగకు మరింత వినోదాన్ని అందించబోతోంది. జనవరి 14 (శనివారం) ఉదయం 9 గంటల నుంచి అలాగే జనవరి 15 సాయంత్రం 6 గంటల నుంచి సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రాం ని ప్రసారం చేయబోతోంది జీ తెలుగు.
సంబరాల పండుగ అయినటువంటి సంక్రాంతికి ప్రతీ ఏడాది మెగా సెలబ్రేషన్‌ని నిర్వహిస్తూనే ఉంది జీ తెలుగు. ఈ కొత్త ఏడాదిలో సంక్రాంతి సంబరాలను మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా జనవరి 14వ తేదీ ఉదయం 9 గంటలకు సంక్రాంతి సంబరాలు మొదటి భాగం ప్రసారం కానుంది. టీవీ స్టార్స్‌తో పాటు ఎనర్జిటిక్ యాంకర్లు రవి, శ్యామల తమ అద్భుతమైన యాంకరింగ్‌తో అలరించారు. అంతేకాకుండా కొన్ని ఆహ్లాదకరమైన గేమ్‌లు మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తాయి.
ఆద్యంతం ఆకట్టుకునే కార్యక్రమాలు, జీ కుటుంబ సభ్యుల ఆటాపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక అతిథిగా హాజరైన క్యూట్ మరియు బబ్లీ మృణాల్ ఠాకూర్ అందరి హృదయాలను గెలుచుకున్నారు. ప్రేక్షకుల్లానే, ఆమె కూడా టీవీ స్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్లు చూసి మైమర్చిపోయారు. వాటిలో లీనమైపోయి వీక్షించారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీవీ స్టార్స్‌ని రెండు టీమ్‌లుగా విభజించారు. ఈ రెండు టీమ్‌లకు హరిత, అన్నపూర్ణమ్మ లీడర్లుగా వ్యవహరించారు. ఈ రెండు టీమ్‌ల మధ్యే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, ఆటలు, కుండ పగులగొట్టడం, సంక్రాంతి ప్రత్యేక భోజనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు మిర్చి పాటకు జీ తెలుగు మహిళా ప్రధాన పాత్రధారుల పర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరినీ అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే మొదటిభాగం మీకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందిస్తుంది. రెండో ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉన్నాయా అని మీరు వెయిట్ చేసేలా చేస్తుంది.
ఇక రెండో భాగం … జనవరి 15న సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతుంది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ సంక్రాంతి సంబరాలు ఈ రెండో భాగంలో ఉంటాయి. మృణాల్ ఠాకూర్ కొన్ని గేమ్‌లలో పార్టిసిపేట్ చేశారు మరియు జీ తెలుగు కుటుంబ సభ్యులతో కూడా మాట కలుపుతారు. ఇవి కార్యక్రమానికే హైలెట్‌గా ఉంటాయి. వీటిని ఆడియన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు.
దీప్తి, గోకుల్… సీతారామం యాక్ట్‌ని తమ నటనతో మృణాల్ ఠాకూర్ ముందు ఆవిష్కరిస్తారు. ఇది కూడా ఈ సంక్రాంతి సంబరాలకు హైలెట్‌గా నిలుస్తుంది. మరోవైపు ఆన్‌స్క్రీన్ జంటలు మరియు సిస్టర్స్ ప్రత్యేక ప్రదర్శన ఎంటర్టైన్మెంట్ను మరో స్థాయికి తీసుకువెళ్తుంది. ఇక ప్రేక్షకులు అస్సలు మిస్ చేయకూడని గేమ్ జిలేబీ తినే గిమ్. ఈ గేమ్‌ని జంటల మధ్య నిర్వహించారు. నటీనటులు తమ భాగస్వామిని ఎత్తుకోవడం, వారి చేతులు ఉపయోగించకుండా జిలేబీలను తినడం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. అంతా సరదా ఆటపాటలు మాత్రమే కాకుండా… యాంకర్ ప్రదీప్ పూనకాలు లోడింగ్ పాట ఎంటర్టైన్మెంట్ను మరో లెవల్‌కు తీసుకువెళ్తుంది. వీటితోపాటు బావ మనోభావాలు ఫేమ్ చంద్రిక రవి సూపర్బ్ డ్యాన్స్, DJ టిల్లు ఫేమ్ నేహా శెట్టి అందించే అద్భుతమైన ఫన్ ప్రేక్షకుల్ని టీవీ స్క్రీన్‌కి కూడా కట్టిపడేలా చేస్తాయి.
మొత్తంగా, జీ తెలుగు సంక్రాంతి సంబరాలు ప్రేక్షకులకు సరికొత్త ఆనందాన్ని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫుల్ కలర్ఫుల్గా సాగిన ఈవెంట్, ఆద్యంతం ఆకట్టుకునే పర్ఫార్మెన్స్లు, ఆర్టిస్టుల అద్భుతమైన డ్యాన్స్‌లు గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతి పండుగను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ప్రేక్షకులు కూడా గతంలో లేని విధంగా జీ తెలుగు సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేస్తారు.
అంబరాన్నంటే సంక్రాంతి సంబరాలను జీ తెలుగుతో కలిసి అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సిద్ధం కండి. జీ తెలుగు సంక్రాంతి సంబరాలు జనవరి 14 (శనివారం) ఉదయం 9 గంటలకు మరియు జనవరి 15 సాయంత్రం 6 గంటలకు… ఎక్స్‌క్లూజివ్‌గా మీ జీ తెలుగులో…













