గెట్ రెడీ ఫర్ హంగ్రీ ఛీతా
పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని సినిమాల్లో ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఓజీ. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్లే సుజీత్ ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు బజ్ పెంచేలా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు. ఆ మధ్య రిలీజైన ఫస్ట్ లుక్ నుంచి రీసెంట్ గా వచ్చిన హంగ్రీ చీతా అనే టీజర్ వరకు అన్నీ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాతో సుజీత్ పవన్ ఫ్యాన్స్ కు చాలా గట్టి ట్రీట్ ఇవ్వబోతున్నట్లు యూనిట్ వర్గాలు కూడా చెప్తున్నాయి.
ఇదిలా ఉంటే ఓజీకు సంబంధించిన హంగ్రీ చీతా అనే లిరికల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. ఓజీ సినిమాటోగ్రాఫర్ కె. రవిచంద్రన్ ఈ విషయమై సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సాంగ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్సుంది.













