Rajamouli: జెన్నీ ఇన్నేళ్లైనా సేమ్ బ్యూటీ.. సేమ్ గ్రేస్

దాదాపు 20 ఏళ్ల తర్వాత రాజమౌళి(rajamoui), జెనీలియా(Genelia) ఇప్పుడు మళ్లీ కలుసుకోగా, వారి కలయికకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో జెనీలియా, రాజమౌళి ఎంతో హ్యాపీగా చాలా సన్నిహితంగా ఉన్న వైనం వారిద్దరి మధ్య బాండింగ్ ను తెలియచేస్తోంది. వీరిద్దరూ కలిసి గతంలో సై(Sye) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
సై సినిమా రాజమౌళికి, జెనీలియాకు చాలా స్పెషల్ మూవీ. ఆ సినిమా చేస్తున్న టైమ్ కు వారిద్దరూ కెరీర్ స్టార్టింగ్ దశలోనే ఉన్నారు. దాంతో పాటూ సై మూవీ టాలీవుడ్ కు రగ్బీ అనే గేమ్ ను పరిచయం చేయడంతో పాటూ ఎంతో కొత్తదనాన్ని కూడా తెచ్చింది. సై సినిమా విజయం వారిద్దరి కెరీర్లకు ఎంతగానో ఉపయోగపడింది. కానీ వారిద్దరూ కలిసి తర్వాత మరో సినిమా చేసింది లేదు.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జెనీలియా రీసెంట్ గానే మళ్లీ కంబ్యాక్ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు మళ్లీ జెనీలియా సినిమా రాలేదు. ఇప్పుడు కిరిటీ(Kireeti) హీరోగా నటిస్తున్న జూనియర్(Junior) అనే సినిమాతో జెన్నీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి గెస్టుగా హాజరయ్యారు. ఈవెంట్ లో జెనీలియాను ఉద్దేశిస్తూ మాట్లాడిన రాజమౌళి.. జెనీలియా ఇన్నేళ్లైనా అలానే ఉందని, సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్ అన్నారు. జెనీలియా గురించి జక్కన్న చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.