Genelia: ఎన్టీఆర్ పై జెనీలియా కామెంట్స్

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన జెనీలియా(genelia), బొమ్మరిల్లు(bommarillu) సినిమాతో ప్రతీ తెలుగు ప్రేక్షకుడి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రితేష్ దేశ్‌ముఖ్(ritesh Deshmukh) ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు, ఇండస్ట్రీకి దూరమైంది జెనీలియా. ఇప్పుడు రితేష్- జెనీలియాకు ఇద్దరు పిల్లలు.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జెన్నీ, ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేసి ఇండస్ట్రీలో బిజీ అవాలని చూస్తోంది. అందులో భాగంగానే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్లో ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఆమిర్ ఖాన్(aamir khan) తో కలిసి సితారే జమీన్ పర్(sithare zameen par) సినిమాలో నటించింది జెనీలియా. ఈ సినిమా జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్(NTR) గురించి మాట్లాడింది. తాను, ఎన్టీఆర్ కలిసి రెండు సినిమాలు చేశామని, ఆయన గొప్ప నటుడని, ఎన్టీఆర్ లో దైవత్వం ఉంటుందని, మీరు మూడు పేజీల డైలాగును ఎన్టీఆర్ కు ఇచ్చినా ఆయన నెక్ట్స్ మినిట్ లో దాన్ని సింగిల్ టేక్ లో చెప్పగలడని, ఇక ఆయన డ్యాన్సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని జెనీలియా చెప్పింది. ప్రస్తుతం జెనీలియా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.