శ్మశానంలో టీజర్ లాంచ్.. ఇదేం ప్రమోషన్ రా బాబు
చిన్న సినిమాలు ఆడియన్స్ దృష్టిలో పడాలంటే వాటికి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ అవసరం. ఆడియన్స్ ను మెప్పించేలా లేదంటే వారిని ఆశ్చర్యపరిచేలా ప్రమోషనల్ టీమ్ ఏదొక ప్లాన్ తప్పక చేయాలి. ఇప్పుడు ఒక సినిమా బృందం తమ సినిమాకు ఎవరూ ఊహించని రీతిలో పబ్లిసిటీ చేయడానికి రెడీ అయిపోయింది.
ఆ సినిమా మరేదో కాదు గీతాంజలి మళ్లీ వచ్చింది. అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన గీతాంజలి సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ కలిసి నిర్మిస్తున్నారు. ఎప్పుడో అనౌన్స్మెంట్ అప్పుడు వార్తల్లో నిలిచిన ఈ సినిమా నుంచి తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు.
ఇప్పుడు సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. హర్రర్ సినిమా కాబట్టి దానికి తగ్గట్లే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను శ్మశానంలో ప్లాన్ చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లోని శ్మశాన వాటిలో గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ లాంచ్ కార్యక్రమం జరగనున్నట్లు ఇప్పటికే మీడియాకు ఇన్విటేషన్స్ కూడా వెళ్లాయి. అంతే కాదు అక్కడ టీజర్ లాంచ్ కోసం ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తున్నారట. టీజర్ రిలీజ్ శ్మశానంలో అనగానే అందరికీ మంచి క్యూరియాసిటీతో పాటూ సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ ఏర్పడుతుంది కాబట్టి ప్రమోషనల్ టీమ్ ఈ విషయంలో సక్సెస్ అయినట్లే.













