మహేష్ చిత్రానికి ఛాన్స్ కొట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్
చిత్ర విచిత్రమైన ఈ చిత్ర సీమలో ఏ రోజు ఎవరు పాపులర్ అవుతారో ఊహించడం కష్టమే…చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇస్తే మరు క్షణం లో వెల్లువలా ఆఫర్లు వచ్చే పరిశ్రమ ఇది విషయానికొస్తే…సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇటీవల ప్రేక్షేకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా టి వి వ్యూయర్ షిప్ లో కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఇప్పటివరకు మహేష్ తన తదుపరి సినిమాని అనౌన్స్ చేయకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ దానికొరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ పక్క ఎస్ ఎస్ రాజమౌళి శ్రీ దుర్గ ఆర్ట్స్ లో ఓ భారీ చిత్రం ఉంటుంది అని అనౌన్స్ అనుకోండి కానీ అది ఇప్పుడిప్పుడే కాదు 2021 లో ప్రారంభం అవుతుంది.
ఒకానొక సందర్భంగా తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో ఉంటుందని చెప్పిన మహేష్, ప్రస్తుతం ఆ సినిమా కథ పూర్తి కాకపోవడంతో దానిని ప్రక్కన పెట్టినట్లు టాక్. అలానే కొద్దిరోజుల క్రితం యువ దర్శకుడు పరశురామ్ చెప్పిన ఒక లవ్ స్టోరీ లైన్ కి ఎంతో ఇంప్రెస్ అయిన మహేష్, ఆయన తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అతి త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుందని కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకుంటారు అనే విషయమై ముందుగా దేవిశ్రీప్రసాద్, ఆ తరువాత థమన్, అలానే ఇటీవల గోపిసుందర్ పేర్లు బయటకు రావడం జరిగింది. థమన్ ని తీసుకుంటారని అప్పట్లో గట్టిగా ప్రచారం సాగినప్పటికీ, ఎందుకంటె గీత గోవిందం చిత్రం మంచి ఆడియో హిట్ అన్న విషయం తెలిసిందే, మరి సరిలేరు నీకెవ్వరూ కి దేవిశ్రీప్రసాద్ సరైన మ్యూజిక్ అందించలేదని ప్రేక్షకులు నీరసపడ్డారు. మరి అదే టైం లో ఆలా వైకుంఠపురం లో సెన్సషనల్ మ్యూజిక్ ఇచ్చాడు థమన్. వీళ్లిద్దరు కాదని తాజాగా అందుతున్న అప్ డేట్ ప్రకారం గోపిసుందర్ ఖాయమయినట్లు చెప్తున్నారు. అయితే ఈసారి ఒకింత కొత్తగా గోపిసుందర్ ని ట్రై చేస్తే బెటర్ అని మహేష్ చెప్పినట్లు టాక్. అలానే పరశురామ్ కూడా తన గత సినిమా గీతగోవిందం కు తీసుకోవడం, ఆ సాంగ్స్ మంచి హిట్ సాధించడంతో యూనిట్ మొత్తం కూడా గోపి కే ఓటేయడం జరుగుతుందని అంటున్నారు.













