గీతా ఆర్ట్స్ కు మచ్చగా మారిన సినిమా
మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన చావు కబురు చల్లగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. పెగళ్లపాటి కౌశిక్ అనే డెబ్యూ డైరక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా చిన్న వయసులోనే భర్త చనిపోయిన అమ్మాయిని ఒక యువకుడు ప్రేమలో పడేయడం అనే కొ్త కథతో వచ్చింది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తుంది. ఫస్ట్ వీక్ తర్వాత ఈ సినిమాని ఫ్లాప్ గా పరిగణించారు.
ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా కార్తికేయ, లావణ్య త్రిపాఠిలు బాగా నటించారనే పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. పబ్లిసిటీ కారణంగా ఫస్ట్ డే ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చినప్పటికీ, రెండో రోజు నుంచి ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది. చావు కబురు చల్లగా చిత్రానికి అన్నీ కలుపుకుని దాదాపుగా 13.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కానీ థియేట్రికల్ రన్ క్లోజ్ అయే నాటికి ఈ సినిమా 5 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయిందంటున్నారు. అంటే దీని ప్రకారం గీతా ఆర్ట్స్ 2 కు ఇది చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇప్పటి వరకు తమ బ్యానర్ లో అన్నీ హిట్ సినిమాలే ఖాతాలో వేసుకున్న గీతా ఆర్ట్స్2 కు చావు కబురు చల్లగా కొంచెం తమ క్రెడిబిలిటీని తగ్గించిందనే చెప్పాలి.













