Suriya: హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నో చెప్పిన సూర్య
గౌతమ్ మీనన్(Gowtham Menon) కు సౌత్ లో సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన్నుంచి సినిమా వస్తుందంటే యూత్ కు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంటుంది. ఆయన దర్శకత్వంలో పని చేయడానికి స్టార్లు సైతం ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అందులోనూ సూర్య(Suriya), గౌతమ్ మీనన్ కాంబోకి మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి హిట్టవడంతో ఆ కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంది.
వాస్తవానికి గౌతమ్ మీనన్ ధృవ నక్షత్రం(Dhruva Nakshatram) సినిమాను సూర్యతోనే చేయాలనుకున్నాడట. సూర్య కూడా ముందు ఓకే అన్నాడట. కానీ ఎందుకో సడెన్ గా సూర్య ఆ సినిమా చేయనన్నాడని రీసెంట్ గా గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తమది సూపర్ హిట్ కాంబినేషన్ అయినప్పటికీ సూర్యతో సినిమా చేయడానికి కుదరలేదని గౌతమ్ తెలిపాడు.
సూర్య కాదన్న తర్వాత గౌతమ్ మీనన్ ఆ సినిమాను విక్రమ్(Vikram) తో తెరకెక్కించాడు. కానీ సూర్య వద్దనుకున్న స్టోరీతో విక్రమ్ ముందుకెళ్లాడనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఏదేమైనా తనకు రెండు హిట్ సినిమాలను ఇచ్చిన గౌతమ్ మీనన్ తో సూర్య సినిమా చేయకపోవడానికి కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది.













