Ye Maya Chesave: ఏ మాయ చేసావె అసలు క్లైమాక్స్ అది కాదట

నాగ చైతన్య, సమంత(Samantha) కలిసి మొదటిసారి నటించిన సినిమా ఏ మాయ చేసావే(ye maya chesaave). ఈ సినిమా రిలీజై దాదాపు 15 ఏళ్లవుతుండగా, ఇప్పుడు ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా గౌతమ్ మీనన్(Gautham Menon) మీడియా ముందుకొచ్చి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాను మొదట్లో తాను అనుకున్నప్పుడు కథ, క్లైమాక్స్ వేరని ఆయన తెలిపారు.
మంజుల(manjula)తో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయినప్పుడు అందులో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా ఉంటే బావుంటుందని, ఆయన్ను ఊహించుకునే కథను రెడీ చేశానని, తీరా కథ రెడీ అయ్యాక ఆయన్ను కలిసి చెప్తే తాను యాక్షన్ సినిమా చేద్దామనుకుంటున్నట్టు చెప్పి సున్నితంగానే ఏ మాయ చేసావే ఆఫర్ ను రిజెక్ట్ చేశారని, మహేష్ తర్వాత మరో స్టార్ హీరోకు ఆ కథను చెప్పగా ఆయను కూడా రిజెక్ట్ చేశారని గౌతమ్ మీనన్ అన్నారు.
దీంతో ఈ సినిమాను కొత్తవాళ్లతో చేయాలనుకుని చైతన్య(Chaithanya)ను లైన్ లోకి తీసుకొచ్చినట్టు చెప్పిన గౌతమ్ మీనన్, ముందుగా తాను అనుకున్న క్లైమాక్స్ ను కూడా వెల్లడించారు. హీరో ఉన్న చోటుకు దూరంలో హీరోయిన్ పెళ్లి జరుగుతుండగా, హీరో తన ఫస్ట్ సినిమా షూటింగ్ లో ఉంటాడు. ఆ మూవీలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తారు. హీరో ముభావంగా ఉండటం గమనించిన చిరూ ఏంటని అడగ్గా, అప్పుడు హీరో తన గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి గురించి చెప్పడం, ఆ తర్వాత చిరూ హీరో కోసం ఓ హెలికాప్టర్ ను పిలిపించి అందులో హీరోయిన్ పెళ్లి చేసుకునే దగ్గరకు వెళ్లడం ఇలా చాలా డిఫరెంట్ గా రాసుకున్నారట. కానీ సడెన్ గా కొత్త హీరో రావడంతో క్లైమాక్స్ ను మార్చినట్టు ఆయన చెప్పారు. కాగా ఏ మాయ చేసావె జులై 19న రీరిలీజ్ కానుంది.